అమరావతి, : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. నాకు సంబంధం లేదు.. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ఆడియా టేప్ ను మీడియాకు విడుదల చేశారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిని బట్టేబాజ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన న్యాయ పోరాటం పూర్తయిన తరువాత. విజయసాయి రెడ్డి చరిత్ర బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. ఒకవైపు వాదన విని కథనాలు రాయొద్దంటూ మీడియాను కోరారు రాజ్. తనపై అసత్య కథనాలు సరికాదని విజ్ఞప్తి చేశారు.
తాను ఇంటిలో లోని సమయంలో గత మార్చిలో సిట్ తనకు నోటీసు లిచ్చిందని వెల్లడించారు కసిరెడ్డి. ఎందుకు నోటీస్ లు ఇచ్చారు వివరణ కోరితే తన ఈ మేయిల్ కు మరో నోటీస్ పంపారని పేర్కొన్నారు.. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు సిట్ బృందం ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా పోరాడుతున్నానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. తనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారని ఆడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లగా నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారని కసిరెడ్డి పేర్కొన్నారు. తాను సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు.. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉందని, దానిపై నిర్ణయం వచ్చిన అనంతరం సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయన్నారు.