- సర్కార్‌కు చేరిన కమిటీ నివేదిక
- ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి
- 15నుంచి 20శాతం పెరిగే చాన్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మద్యం ధరల పెంపునకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్ వద్దకు చేరింది. ప్రస్తుత ధరలకు అదనంగా మరో 15 శాతం మేర పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. వీలైతే ఏప్రిల్ 1నుంచి కొత్త ధరలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, అందులోని సిఫార్సులకు అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
తెలంగాణలో చివరిసారి బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల బీర్ ధరలను పెంచిన ప్రభుత్వం, మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వాటి ధరలపైనా ఆలోచన చేస్తోంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని కమిటీ తాజాగా మద్యం ధరలను మరో 15నుంచి 20 శాతం పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తెలంగాణలో అన్ని రకాల మద్యం ధరలు ఇతర పొరుగు రాష్ట్రాలకంటే తక్కువగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కర్నాటక, తమిళనాడు, ఢిల్లి, ఏపీల్లో మద్యం ధరలు తెలంగాణ కంటే తక్కువగా ఉండటంతోనే అక్కడినుంచి ఎన్‌డీపీ రాష్ట్రంలోకి వస్తుందని తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదించింది.
పెరగనున్న మద్యం ధరలతో ప్రజలపై రూ.2500 కోట్ల అదనపు భారం పడనుందని సమాచారం. 180 ఎంఎల్ చీప్ లిక్కర్ ధర రూ.110 ఉంది. దీనిపై మరో రూ.20 వరకు పెరిగే అవకాశముంది. దీంతో చీప్‌లిక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమి యం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచటానికి ప్ర భుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. త్వరలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలిసింది.