పేకాట శిబిరంపై మెరుపు దాడి..

  • 18 మంది పట్టివేత
  • రూ.3.50 లక్షలు స్వాధీనం

గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా నందివాడ మండలం గాజులపాడు శివారులో భారీ పేకాట శిబిరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. 18 మందిని అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి 3.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు . గాజులపాడు జూద శిబిరంపై ఇటు కృష్ణా, అటు భీమవరం పేకాట రాయుళ్లకు సేఫ్టీ జోన్ గా పేరొందింది, అకస్మాత్తుగా కృష్ణాజిల్లా పోలీసులు దాడి చేయటంతో.. జనం ఆశ్చర్య పోయారు. ఈ దాడిలో భారీ మొత్తంలో నగదు లభించినట్టు పేకాటరాయుళ్లు చెబుతున్నారు.

Leave a Reply