Lift irrigation | న్యాయం జరిగే వరకు పోరాడుతాం…

Lift irrigation | న్యాయం జరిగే వరకు పోరాడుతాం…
Lift irrigation | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం(Scheme of lifts)లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని ఓబులాపూర్ సర్పంచ్, సత్యనారాయణరెడ్డి, సమస్తాపూర్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఊట్కూర్ ఉపసర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ అన్నారు.
ఈ రోజు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లను భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం(justice) జరిగే వరకూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.
భూ నిర్వాసితుల సమస్యలను తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని వారి హక్కుల సాధన కోసం గ్రామస్థాయి నుండి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జీ. వెంకట్రాంరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజ్ గౌడ్ ,గోపాల్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధర్మరాజు గౌడ్, ఉడుమల్ గిద్ద గోపాల్, సీఐటీయు జిల్లా కార్యదర్శి బల్ రామ్, తెలంగాణ సాంస్కృత నేత కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
