జనజీవనం అస్తవ్యస్తం

  • పశ్చిమలో భారీ వర్షం

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఎక్కడికి రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. కళాశాలలకు, పాఠశాలలకు, ఉద్యోగాలకు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు కురుస్తున్న ఈ వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భీమవరం రైల్వే అండర్ బ్రిడ్జిల(Bhimavaram Railway Under Bridges)లో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు(two wheeler vehicles) ఈ వర్షపు నీటిలో చిక్కుకుని కోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది తాడేపల్లిగూడెం(Tadepalligudem) మార్గంలో గరగపర్రులో రహదారిపై భారీగా వర్షం చేరుకోవడంతో వాహన రాకపోకలకు ఏర్పడుతుంది. ట్రాఫిక్ జామ్(traffic jam) అవుతుంది. దుర్గాపురంలో రహదారులపై వర్షపు నీరు చేరడంతో ఇంజన్లతో నీటిని బయటికి తోడుతున్నారు.

పాలకోడేరు, వీరవాసరం, ఉండి, ఆకివీడు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు(Mogalthur) తదితర మండలాల్లో ఉదయం నుంచి భారీ కురుస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక శాతం ఖరీఫ్ వరి పంట(Kharif paddy crop) ఈనికి దశలో ఉంది. ఈ దశల కురుస్తున్న వర్షాలతో వరి పంటకు నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply