Library | మాటకు కట్టుబడి ఉండడమే బీజేపీ లక్ష్యం

Library | మాటకు కట్టుబడి ఉండడమే బీజేపీ లక్ష్యం
Library | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాత్ వేరబెల్లి అన్నారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కొరకు 10 లక్షలు సొంతగా ఇస్తామని అన్న హామీ ప్రకారం ఈ రోజు దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామ ప్రజలు సర్పంచ్ గా మొరుపుటాల మానస తులసిని గెలిపించడంతో గ్రామా అభివృద్ధిలో గ్రంథాలయ నిర్మాణం(Library construction) కొరకు భూమీ పూజ చేశారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ… సర్పంచ్ ఎన్నికల్లో తన మాట మీద నమ్మకంతో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే బాధ్యత బీజేపీ పార్టీదే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అవుతున్నాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్గనూర్ సర్పంచ్ మొరుపుటాల మానస, సంజీవ్, గోపతి రాజయ్య, బందెల రవి గౌడ్, చుంచు లక్ష్మి నారాయణ, పంచేర్పుల సత్యం, కాండ్రపు ఏసయ్య, సంతోష్, బెడద సురేష్, కర్ణాల కిషన్, ముత్తినేని మల్లేష్, చుంచు గిరిధర్, గడికొప్పులు సురేందర్, దార శేఖర్, బోర్లకుంట వెంకటేష్, ముత్తే వెంకటేష్, మొండయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
