Letters of Appreciation | చిన్న పొర్ల విద్యార్థులకు అభినంద‌న‌లు..

Letters of Appreciation | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల పి ఎం శ్రీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడంతో నారాయణపేట జిల్లా అదనపు రెవెన్యూకలెక్టర్ ఆదివారం విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాట్లాడుతూ… నారాయణపేట జిల్లా స్థాయిలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నారాయణపేట జిల్లా స్థాయిలో నిర్వహించిన ఉపన్యాసం పోటీల్లో చిన్నపూర్ల 10వ తరగతి విద్యార్థిని పాపన్నోళ్ళ పూజ ప్రథమ స్థానం లో నిలవగా జూనియర్ విభాగంలో 8వ తరగతి బాలిక శ్రీలత, ద్వితీయ విభాగంలో నిలవడం అభినందనీయమనిఅన్నారు.

విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణించాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో తాపసు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ, చిన్న పొర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ కాంబ్లె, ఉపాధ్యాయులు తిరుపతి నాయక్, శీలం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply