ప్రశాంతంగా జరుపుదాం
- అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం వద్దు
- పోలీసు బలగాలు బీ అలెర్ట్
- కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు
( హొళగుంద, ఆంధ్రప్రభ): కర్నూలు జిల్లా దేవరగట్టు మాళవి సహిత మల్లేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా జరిగే ప్రసిద్ధ బన్నీ ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున దేవరగట్టుకు తరలిరావడం నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు.
భద్రత, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఆహార వసతులు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఆరోగ్య, రవాణా, విద్యుత్ తదితర విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, బన్నీ ఉత్సవం సమయంలో శాంతి భద్రతలు సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను మొబిలైజ్ చేస్తున్నాం.

