చిరుత సంచారం..

చిరుత సంచారం..

తిరుపతిరూరల్, ( ఆంధ్రప్రభ )
తిరుపతి జిల్లా గ్రామీణ మండల పరిధిలోని మంగళం పంచాయతీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మంగళం రోడ్డులోని భోపాల్ హౌసింగ్ కాలనీలో ఉదయం మూడు గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద ఉన్న కుక్కను చంపి పట్టుకెళ్ళింది. ఈ దృశ్యాలు చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన గురయ్యారు. అటవీ శాఖ అధికారులు స్పందించి జనావాసాల్లో తిరుగుతున్న చిరుతను బంధించాలని కోరుతున్నారు.

Leave a Reply