శ్రీశైలం సమీపంలో చిరుత కలకలం..

శ్రీశైలం సమీపంలో చిరుత కలకలం..

  • భయాందోళనలో భక్తులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లా లో జ్యోతిర్లింగాలలో ఒకటేనా శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్ద సోమవారం తెల్లవారుజామున శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న భక్తులకు చిరుత కనిపించింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో అనవసరంగా ఆగకుండా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

అడవి ప్రాంతం కావడంతో వన్యప్రాణుల సంచారం సాధారణమేనని, ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. గత రెండు రోజుల క్రితం సాక్షి గణపతి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం భక్తులను భయపెట్టింది. వేసవికాలం కావడంతో అడవి జంతువులు క్రూర మృగాలు నీటి కోసం పట్టణ ప్రాంతాల్లోకి వలసలు వస్తున్నాయి. రాత్రి సమయాలలో వచ్చే ఇలాంటి జంతువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా జంతువులు సింహాలు చిరుతలు ఎలుగుబంట్లు కనిపించినచో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Leave a Reply