మాట జారి వెనక్కి తీసుకున్న మంత్రి

మాట జారి వెనక్కి తీసుకున్న మంత్రి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు.. శ్రీవారిని నమ్మరు అని అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యులను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. కాగా శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా క్రిస్టియన్ అని అన్నారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం తెలిపాడు. దీంతో వెంటనే క్షమాపణ చెప్పాలిని డిమాండ్ చేశారు. తాను క్రిస్టియన్ ని కాదు హిందువుననే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో గందరగోళం నెలకొంది. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నని, శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ గందరగోళంలో శాసనమండలిని 5 నిమిషాలు వాయిదా వేశారు.
