అదే ప్ర‌థ‌మ ల‌క్ష్యం..

  • పంట నష్టం, ధాన్యం రక్షణపై చర్యలు..

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారుల‌తో వీడాయో కాన్ఫ‌రెస్స్ లో రేవంత్ రెడ్డి ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుఫాన్ కార‌ణంగా వ‌చ్చిన‌ వర్షాలతో వరి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లిందని నివేదికలు అందాయి.

ఈ సంద‌ర్భంగా వర్షాలతో తడిసిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలని సీఎం ఆదేశించారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

అధికారులంద‌రూ సెలవులు రద్దు చేసుకి క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే విధానపరమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని సూచించారు. నష్టపరిహార అంచనాలకు వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా సర్వేలు చేయాలని తెలిపారు.

ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. అన్ని చోట్ల వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్లుగా పౌరసరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.

Leave a Reply