కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయ‌కులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయ‌కులు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం రహమత్ డివిజన్ వినాయక నగర్ నుండి రహమత్ నగర్ వరకు నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Pongileti Srinivas Reddy), ఇంచార్జి ఎమ్మెల్యేలు, MLCలు, చైర్మ‌న్‌లు పాల్గొన్నారు. BRS, బీజేపీ పార్టీ నుండి మంత్రుల‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు.

అనంతరం ఆటో యూనియన్, సీనియర్ అసోసియేషన్, టైలర్ అసోసియేషన్‌(Tailor Association) భలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ CN రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న యువ, ప్రజా సంకల్పంతో నిండిన అభ్యర్థి నవీన్ యాదవ్‌ని గెలిపించడం ఎంతో కీలకమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Party), కార్యకర్తలు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply