Leaders Shocked 3 : అందరినీ ఆదుకుంటాం

Leaders Shocked 3 : అందరినీ ఆదుకుంటాం

క్షతగాత్రులకు మంత్రి సంధ్యారాణి ఓదార్పు

( చింతూరు,   ఆంధ్రప్రభ)

అల్లూరి సీతారామరాజు జిల్లా  చింతూరు మారేడుమిల్లి  ఘాట్ (Maredumilli Ghat Road ) రోడ్డులో  శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై  ఏపీ ప్రభుత్వం చలించిపోయింది.  ఈ ప్రమాద సమాచారంతో  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి , రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి (Leaders Shocked 3)  ముందుగా చింతూరు మారేడుమిల్లీ , ఘాట్ రోడ్డు వద్ద ప్రమాద స్థలిని  పరిశీలించారు.  అక్కడ నుండి క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.   తొమ్మిది మంది మృత దేహాలను  స్వయంగా పరిశీలించారు. బాధిత  క్షత గాత్రుల్ని పరామర్శించి  ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మృతులు కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.  ఘటన తీవ్ర బాధాకరం అని  విచారం వ్యక్తం చేశారు.

Leaders Shocked 3

Leaders Shocked 3

అందరినీ  ఆదుకుంటాం చింతూరు మారేడుమిల్లీ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అన్ని కుటుంబాలను ఆదుకుంటాం అని గిరిజన శాఖమంత్రి  గుమ్మడి సంధ్యారాణి (Minister Sandhya Rani)  అన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ. గాయపడిన క్షత గాత్రులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని   ఏ ఆసుపత్రిలో చికిత్స పొందాలని అనుకుంటే అక్కడ కూడా  క్షతగాత్రులు  మెరుగైన వైద్యం అందిస్తామని ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

Leaders Shocked 3

ప్రమాద ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆమె తెలిపారు. మంత్రి వెంట అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేశ్ (A Dinesh) కుమార్ , రాష్ట్ర ఎస్టీకమీషన్ చైర్మన్ సొల్ల బోజ్జిరెడ్డి రంపచోడవం ఎమ్మెల్యే శిరీషదేవి. రంపచోడవరం ఐటిడిఏ స్మరన్ రాజ్ , చింతూరు ఐటిడిఏ పీ ఓ శుభం నోక్వాల్ , ఎ ఎస్ ఆర్ జిల్లా ఓ ఎస్ డి పంకజ్ కుమార్ మీనా, చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్,వివిధ శాఖల అధికారులుపలువురు ప్రజా ప్రతినిధులుఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ALSO READ : At China Wall Fatal Accident  :  9 మంది దుర్మరణం

ALSO READ : Leaders Shocked 2 :  క్షతగాత్రులకు ఓదార్పు   

Leave a Reply