Leaders | బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి

Leaders | బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి
Leaders | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని గోలపల్లి గ్రామంలో బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచులు రామచంద్రయ్య, బీజేపీ నాయకులు జె.ఆంజనేయులు సాయన్న, నరసింహులుతో పాటు తదితరులున్నారు. వీరిని మాజీ జెడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.గణేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కోళ్ళ వెంకటేష్ లు కాంగ్రెస్ పార్టీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎప్పటికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక మంత్రి నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల కాంగ్రెస్ నాయకులు కట్ట వెంకటేష్, వాకిటి హనుమంతు, మామిళ్ల ఆంజనేయులు, కల్లూరి గోవర్ధన్, ఓబ్లేష్, కావలి రాజేందర్, గోలపల్లి గ్రామానికి చెందిన నాయకులు సురేష్ కుమార్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
