Leaders | అది అంబేద్కర్ పెట్టిన భిక్ష

Leaders | అది అంబేద్కర్ పెట్టిన భిక్ష


పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ సెంటర్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే (MLA) వర్ల కుమార్ రాజా, నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తాడిశెట్టి నరేష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కూటమి నేతలతో కలిసి జోహార్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ… మరణించి 69 ఏళ్లు గడిచిన ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ (Ambedkar) ప్రతి ఒక్కరు మనసుల్లో చెరగని ముద్ర వేశారు. నాలాంటి వారు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా, కోట్లాదిమంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నా.. అది మహానీయుడు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్ష కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply