కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీడియాకు పంపించారనే కారణంతో 20 మంది ఉద్యోగులను ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ తొలగించింది. ఏ ఉద్దేశంతో సమాచారాన్ని లీక్ చేసినా అది కంపెనీ విధానాలకు విరుద్ధమని మెటా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇటీవల కంపెనీలో అంతర్గత దర్యాప్తు చేపట్టామని, దాంట్లో 20 మంది ఉద్యోగులు దోషులుగా తేలారని, వారు కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి త్వరలో మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
సంస్థకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన అంశాన్ని తాము సీరియస్గా తీసుకున్నామని, లీకులు జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.