ఓపీడీ ఆర్ రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

జైనూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో మార్చి 15 16 తేదీల్లో జరిగే ఓ పి డి ఆర్ రాష్ట్ర మహాసభల కరపత్రాలను కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో శుక్రవారం గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుటికెల శంకర్ నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కుటికల శంకర్ మాట్లాడుతూ.. ప్రజలు తన మౌలిక సమస్యల కొరకు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు
గురవుతున్నారని కార్మికులు రైతులు తమ యొక్క హక్కులను కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి పరిశ్రమ స్థాపన పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల ప్రజలను గిరిజనులను వారి వారి గ్రామాల నుండి నివాసుల నుండి భూముల నుండి వెళ్లగొడుతున్నారని ప్రజలకు భూమి స్వతంత్రం ప్రజాస్వామ్య హక్కులు మౌలికమైనవి అవగాహనతో వాటికి పరిరక్షించడానికి 1975 వ సంవత్సరం నుండి అన్ని రకాల వ్యక్తులకు నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా గాను పోరాడుతున్న ప్రజలకు అండంగా ఓ పి డి ఆర్ నిలబడుతుందన్నారు.
ఈ సభకు భారీ ఎత్తున కార్మికులు కర్షకులు మేధావులు విద్యార్థులు అన్ని రంగాల ప్రజలు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం గ్రామీణ పేదల సంఘం జిల్లా.సిడం ధర్మము, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు :వాగ్మారే సంబాజీ, నాయకులు,, సిడం రాజు, ఆత్రం తులి, మాడవిసాగర్, తొడసం రిషీ లు పాల్గొన్నారు.
