అర్ధరాత్రి మొరం తవ్వకాలు.. చేస్తుంది ఎవరు..?

అర్ధరాత్రి మొరం తవ్వకాలు.. చేస్తుంది ఎవరు..?

బోధన్, ఆంధ్రప్రభ : కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ రాత్రి సమయాలలో ఇసుక మొరం తవ్వకాలు అక్రమ రవాణాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది అదుపు చేయలేకపోతున్నారు. మండల స్థాయి అధికారుల సహకారంతోనే రాత్రి సమయాలలో వనరుల తవ్వకాలు రవాణా జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి మండల శివారులో రాంపూర్ గుట్ట నుంచి గత 15 రోజులుగా తవ్వకాలు చేపట్టుకున్నప్పటికీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కనీసం స్పందించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

అనుమతులు పొంది పగలు తవ్వకాలు చేపట్టి రవాణా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించి రాత్రి సమయాలలోనే గుట్టలు స్వాహా చేస్తున్నారు. రాంపూర్ శివారులోని గుట్టలో తవ్వకాలు నిలిపివేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. మొరం కాంట్రాక్టర్లకు మద్దతు ఇస్తూ రాత్రి సమయాలలో ఇసుక రవాణాకు పోలీస్, రెవెన్యూ అధికారులు తెరలేపుతున్నారనే విమర్శలు వెళువెత్తుతున్నాయి.

Leave a Reply