హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) పార్థీవ దేహానికి ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, (ap CM Chandra Babu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Deputy CM pawan kalyan)లు కోట నివాసానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు

అనంతరం ఫిల్మ్‌నగర్‌లోని (Film Nagar ( నివాసం నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం (mahaprastanam) వరకు కోట శ్రీనివాస రావు అంతిమయాత్ర (last rites) కొనసాగింది.
అనంతరం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు ముగిశాయి. కోట శ్రీనివాస రావుకు ఆయన మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు. అంతకుముందు తమ అభిమాన నటుడు కోట శ్రీనివాస రావును కడసారి చూపు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.

