Last Day | నామినేషన్లకు నేడే ఆఖ‌రు

Last Day | నామినేషన్లకు నేడే ఆఖ‌రు

  • చివ‌రి రోజు నామినేష‌న్ల వెల్లువ‌
  • భారీగా త‌ర‌లివ‌స్తున్న అభ్య‌ర్థులు

Last Day | చెన్నూర్ ఆంధ్రప్రభ : నామినేషన్ల పర్వం చివ‌రి అంకానికి చేరుకుంది. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు నేడు (శుక్ర‌వారం) చివరిరోజు. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు వేసేందుకు కదలి వస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మేజర్ గ్రామపంచాయతీని గత ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. ఇక్క‌డ ఇది రెండవ ఎన్నిక. గత మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఈ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. అప్ప‌డు బీఆర్ఎస్ అభ్యర్థి అర్చన గిల్డా ఎన్నిక‌ల్లో గెలిచి చైర్‌పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Last Day

ప్రస్తుతం కూడా బీసీ మహిళకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉందని చెప్ప‌వ‌చ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు బలమైన అభ్యర్థులను రంగంలో దించే ప్రయత్నాలలో ఉంది. ప్రతీ పార్టీ నుంచి ఇద్దరిని నామినేషన్లు వేసేలా అధిష్ఠానాలు ఆదేశించినట్లు సమాచారం. 18 వార్డులు ఉన్న మున్సిపల్‌కు అర్ధ శాతం మహిళ రిజర్వేషన్ కావడం, చైర్‌పర్సన్ బీసీ మహిళకు కల్పించడంతో ప్రధాన పార్టీల నాయకులు వారి వారి సతీమణులను పోటీలో నిలిపేందుకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply