సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్‌: ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభ‌వించింది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు. ఈ విషయాన్ని సూడాన్‌ లిబరేషన్‌ మూమెంట్‌/ఆర్మీ ధ్రువీకరించింది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు చెప్పారు.

ఈ ఘటన స్థానికులను, దేశ ప్రజలను కలచివేసింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సహాయక చర్యలు పూర్తి చేసేందుకు, మృతుల శరీరాలను వెలికితీసేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు.

Leave a Reply