ల్యాండ్ బ్రోకర్ కమలేష్ కేసు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భూబ్రోకర్ కమలేష్ కుమార్ (Kamlesh Kumar) కేసులో జార్ఖండ్ రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) తనిఖీలు నిర్వహించారు. ఈ స్కామ్‌లో ఆయన్ను 2024 జూలై 26న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన సంగతి తెలిసింది.
కాగా ఈ కేసులో మరింత సమాచారం కోసం.. ల్యాండ్ బ్రోకర్ కమలేష్ కుమార్ కేసులో పీఎంఎల్ఏ 2002 కింద ఢిల్లీలో మూడు, రాంచీలో ఆరు కలిపి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ(ED) సోదాలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంగణంలో ప్రధానంగా కమలేష్ కుమార్ ప్రధాన సహచరుడు బీకే సింగ్, సంబంధిత వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి ఈ సోదాలను కమలేష్ కుమార్ నివాసాలు, అతని స్నేహితుల ఆఫీసులలో రైడ్స్ జరుగుతున్నాయి. రైడ్స్ క్లోజ్ అయితే పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి.

