తక్కువ ధరకే ల్యాండ్ అని టోకరా..
వరంగల్, ఆంధ్రప్రభ సిటీబ్యూరో : ప్రైమ్ లొకేషన్లో సరసమైన ధర కంటే తక్కువ ధరకే విలువైన భూములు అంటూ పక్కా పథకం ప్రకారం ప్రచారం చేసి అమాయకుల నుండి కోటి రూపాయలు కొల్లగొట్టాడు. 2021లో రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారంతో బురిడీ కొట్టించి సదరు కేటుగాడైన వ్యాపారి పరారీలో ఉన్నాడు. ఎంతో నమ్మకంతో అయిన వారినే నమ్మించి 2021 సంవత్సరం నుండి తప్పించుకు తిరుగు తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో డబ్బులు తీసుకున్న నయా వంచకుడి కోసం బాధిత కుటుంబాలు వెతుకుతూనే ఉన్నారు.
ఎంతకు జాడ తెలియక పోవడంతో న్యాయం చేయమని అభ్యర్థిస్తూ హన్మకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్(Maccha Shivakumar) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన నిందితుడు రామిడి సంపత్ రెడ్డి(Ramidi Sampath Reddy) (36) ని హన్మకొండ బస్టాండ్ వద్ద ఈ రోజు పట్టుకున్నట్టు హన్మకొండ మచ్చ శివకుమార్ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని బంధు, మిత్రులను నమ్మించి మోసం చేసిన్నట్టు విచారణలో అంగీరించడన్నారు.
అతి తక్కువ ధరకే భూములు ఇపిస్తానని బాధితులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన్నట్టు ఒప్పుకున్నాడన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి భూములు చూపెట్టకుండా, వాయిదా వేస్తూ మోసం చేసినట్టు కూడా నిందితుడు రామిడి సంపత్ రెడ్డి(Ramidi Sampath Reddy) అంగీకరించాడన్నారు. నాలుగేళ్లుగా భూములు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో బాధితులు ఈ సంవత్సరం జనవరి నెలలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి గత సంవత్సర కాలం నుండి నిందితుడు పరారీలో ఉన్నాడని గుర్తించి, సదరు నిందితుడిపై నిఘా వేశామన్నారు. గురువారం హనుమకొండ బస్టాండ్ వద్ద నిందితుడిని పట్టుకొని అతని విచారించి, నిందితుడిని అరెస్ట్(Arrested) చేసినట్లు ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. బాధితుల నుండి తీసుకున్న కోటి రూపాయలను ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి అందులో డబ్బులు పెట్టి పోగొట్టు కున్నాడని చెప్పారు. నిందితుడైన సంపత్ రెడ్డిని ఈ రోజు రిమాండుకు తరలించిన్నట్లు హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు.