Lakshmareddy | సంగంబండ అభివృద్ధి కోసం పాటుపడతా గెలిపించండి
సర్పంచ్ అభ్యర్థి గవినోళ్ళ సుమిత్రమ్మ
సంగంబండలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి గవినోళ్ళ సుమిత్రమ్మ
Lakshmareddy | మక్తల్ , (ఆంధ్రప్రభ) : సంగంబండ అభివృద్ధే ధ్యేయంగా పాటుపడతానని తనను సర్పంచిగా గెలిపించాలని నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గవినోళ్ళ సుమిత్రమ్మ విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీసర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నేడు గ్రామం నందు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గవినోళ్ళ సుమిత్రమ్మ మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి తోకలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని గడపగడపకు వెళ్లి ఎన్నికల్లో సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నాయకత్వంలో సంగంబండకు పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బండను తొలగించి 20 గ్రామాలకు సాగునీరు అందించడమే కాకుండా రావలసిన పరిహారం కూడా ఇప్పించడం జరిగింది అన్నారు. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు .గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు .గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గవినోళ్ల బాల్ రెడ్డి గ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

