Lakshettipet | ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రం

Lakshettipet | ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రం

Lakshettipet | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెవెన్యూ శాఖలో విశేష సేవలందించినందుకు లక్షేట్టిపేట తహసీల్దార్ కమ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దిలీప్ కుమార్ ని ప్రభుత్వం ప్రశంస పత్రం పురస్కారంతో గౌరవించింది. ఈ రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా దిలీప్ కుమార్ ప్రశంస పత్రం అందుకున్నారు. సీనియర్ తహసీల్దార్ గా రెవెన్యూ శాఖలో దిలీప్ కుమార్ సేవలు మరువలేనివని కలెక్టర్ పేర్కొన్నారు. పురస్కారం అందుకున్న అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ… ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. వృత్తి పరమైన నైపుణ్యాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తూ, ఆత్మ విశ్వాసంతో ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందిస్తానని తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తానన్నారు.తహసీల్దార్ కు ప్రశంస పత్రం పురస్కారం రావడం పట్ల తోటి ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply