అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.

అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
రాప్తాడు, ఆంధ్రప్రభ : అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది కోట్ల దోపిడీకి తెర తీసిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న క్రైమ్‌ను ప్రజల ముందు ఉంచుతున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. అనేక డైవర్షన్ టెక్నిక్‌లను ఉపయోగిస్తూ వివిధ మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వం చీప్ పాల్‌టిక్స్‌కు పాల్పడుతోందని అన్నారు.
ఓ వైపు రైతుల కరువుతో అల్లాడిపోతుంటే సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన భరోసా కూడా ఇవ్వలేదు. పంటల భీమా అనేది రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయింది. ఇన్‌ఫుట్ సబ్సిడీ గురించి పట్టించుకోలేదు. రైతు అన్నమో రామచంద్రా అని ఏకరువు పెడుతున్న తరుణంలో రైతుల సమస్యలను పక్కన పెట్టారు. అమరావతి పేరుతో విచ్చలవిడి దోపిడీకి స్కెచ్ వేశారు. ప్రశ్నించిన వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఉద్దేశించి ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు అవసానదశ సమీపించిందా? అని అనిపిస్తోంది. ఆయన రాజకీయ జీవితం చరమాంకంలో ఉన్నట్లు అనిపించింది.
2014-19 సీఎంగా ఉన్నప్పుడు విభజన సమయంలో ప్రత్యేక హోదాను పోగొట్టారు. రెండోసారి సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరుకు రాష్ట్రానికి మేలు జరిగింది లేదు. అమరావతి నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని అందులో మీరు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకం అని జగన్ చెబుతున్నారు. కేంద్రీకృత అభివృద్ధి విధానానికి వ్యతిరేకం అని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ గురించి పట్టించుకోరు. కనీసం మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ ఏరియాగా కలుపుకునే రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. అతి తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటవుతుందని సూచన ఇచ్చారు. అదే జరిగితే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటిన్ నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాని 28 గ్రామాలున్న అమరావతి ప్రాంతంలో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు. మళ్లీ రెండోదశ భూసేకరణకు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇందు కోసం ఇంకో లక్ష కోట్లు అప్పులు చేస్తామంటున్నారు. మీరు మీ బినామీలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతానికి రాష్ట్ర సంపదనంతా ఎట్లా తరలిస్తారు? 13 జిల్లాల ప్రజలు ఈ అప్పులు ఎందుకు కట్టాలి. తాము పన్నులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు? అమరావతికి ఇచ్చిన ప్రాధాన్యతను రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ–నీవా పూర్తవుతుంది. హెచ్‌ఎల్‌సీ మోడలైజేషన్ పూర్తవుతుంది. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలవరం డైవర్షన్ వల్ల ఏపీ ఎగువ ప్రాంతాలకు కేటాయింపునకు అవకాశం ఉన్న 45 టీఎంసీల నీటిని హంద్రీనీవా గాలేరు-నగిరి వెలిగొండ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించండి. ఇందుకు డబ్బు కూడా ఖర్చు కాదు. హంద్రీనీవా నుంచి చిత్తూరు జిల్లాకు నీరు ఇచ్చే అవసరం లేకుండా గండికోట నుంచి గాలేరు-నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీటిని కేటాయిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన స్కీంను పూర్తి చేస్తే ఆ 20 టీఎంసీల నీటిని కూడా ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలకు మాత్రమే కేటాయించాలి.అలాగే 6300 క్యూసెక్కులకు హంద్రీనీవా విస్తరణ పనులకు జగన్ టెండర్లు పిలిచారని వాటిని కూడా పూర్తి చేయాలి. దాదాపు 2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తవుతాయి. కనీసం వీటినైనా పట్టించుకోండి అని చెప్పారు.పిల్లకాలవలు నిర్మిస్తేనే ఏ ప్రాజెక్ట్ లక్ష్యమైనా నెరవేరుతుంది. అలా చేయకుండా హంద్రీనీవా కాలువకు ఏకంగా లైనింగ్ వేసేశారు.
మా నోళ్లు ఎండబెడుతూ మా కడుపు కొడుతూ ఈ ప్రాంత రైతాంగానికి తీరని శాపాన్ని మిగిలిస్తూ కుప్పానికి నీళ్లు తీసుకుపోవాలని చూస్తున్నారు. లైనింగ్ కారణంగా సమీపంలోని బోర్లన్నీ ఎండిపోయాయి. ఇప్పటికైనా వెంటనే పిల్లకాలవ నిర్మాణాలు చేపట్టండి.బోర్లు ఎండిపోయిన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. నేను ఎంఎల్‌ఎ అయిన తర్వాత 60 శాతం పనులు పూర్తి చేయించాను. 170 కోట్లు బిల్లులు చెల్లించాము. 2024లోపు పనులు పూర్తయి ఈ కాలువ ద్వారా కూడా డ్యాంకు నీళ్లు తీసుకొస్తే ప్రకాష్‌రెడ్డికి మంచిపేరు వస్తుందని భయపడి అప్పటి కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపించారు. ఈరోజు మల్లీ మీ కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తున్నారు.
ఇప్పటి వరుకు రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదు. బిల్లులు బకాయిలు రైతులకు చేపట్టాల్సిన పనులకు ఇంకా 300 కోట్లు అవసరం ఉందన్నారు.మరి ఎప్పుడు ఎలా పూర్తి చేస్తారు. ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు?ఇది ఇంకా ఆలస్యవమతున్నందునే తురకాలపట్నం చెరువు మీదుగా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావచ్చని చెప్పాము. రాప్తాడు టిడిపి ఎమ్మెల్యే సునీత పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యే కాగానే వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాం నింపాము.ఆమె గెలవగానే గేట్లు కూడా తొలిగించి ఉన్న అరకొర నీటిని కూడా వదిలేయించింది. సాగు తాగు నీరు లేక గ్రామాల్లో అల్లాడుతున్నారు. ఇప్పటికైనా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డ్యాంకు నీళ్లు తెచ్చేలా చూడండి. అలాగే తాగునీటి కోసం పీఏబీఆర్ నుంచి ప్రారంభించిన పథకాన్ని కూడా పూర్తి చేయండి అని చెప్పారు. ప్రజలు మౌనంగా ఉన్నారంటే అంగీకరమని కాదు తిగరబడేందుకు సన్నద్దమవుతున్నారనేది గుర్తు పెట్టుకోండి.ఆ పరిస్థితులను తెచ్చుకోకుండా పేరూరు డ్యాంకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నాను.
