అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
దేవరకొండ, ఆంధ్రప్రభ : విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్(Nenavat Balu Naik) అన్నారు. ఈ రోజు దేవరకొండ మండలంలోని ముదిగొండ గ్రామంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 26.85 లక్షల వ్యయంతో మరమతుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అయిన తర్వాతనే పేదింటి బిడ్డలకు చదువు అందుతుందని బాలు నాయక్ అన్నారు. గత ప్రభుత్వంలో విద్య పేరుతో కూడా దోచుక తిన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈఐ నిధుల నుంచి మంజూరైన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు(public representatives), వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

