కర్నూలు స్కేటింగ్ క్రీడాకారుల ర్యాలీ

వందేమాతరం అంటూ నినాదాలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ కర్నూలు పట్టణంలో స్కేటింగ్ క్రీడాకారులు ఆదివారం ఉదయం స్కేటింగ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బంకిం చంద్‌చటర్జీ రాసిన వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆదేశాలతో కర్నూలు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను చేత పెట్టి కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నుంచి ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ర్యాలీలో పలు పాఠశాలల స్కేటింగ్ క్రీడాకారులు జిల్లా స్కేటింగ్ సంఘం కార్యదర్శి అబూ బాకర్, కర్నూలు జిల్లా స్కేటింగ్ సంఘం సీఈఓ పి. సునీల్ కుమార్, స్కేటింగ్ సంఘ సభ్యులు శిరీష్ బాబు, వీరేశ్, నారాయణ, హనుమంతు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.


