Kurnool | కలెక్టరేట్లో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు .. ఉద్యోగులకు తప్పిన ముప్పు

కర్నూలు బ్యూరో, , ఆంధ్రప్రభ (Andhra Prabha) ఒకరు కాదు, ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఉద్యోగులు (Employees )తమ దినచర్యలో భాగంగా వాకింగ్ చేస్తున్నారు. అయితే ఉన్నట్లు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలు

(Powe polla) నేలపరిగాయి. వాటిపై భారీ వృక్షం విరిగిపడింది. ఇంకేముంది వాకింగ్ ( Walking)చేస్తున్న చుట్టుపక్క వారు గుర్తించి పరుగులు లగించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది .

కర్నూల్ కలెక్టరేట్లో (Collectorate ) బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఘటన ఇది.కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజు మాదిరే కార్యాలయం ఆవరణలో కొంతమంది ఉద్యోగులు వాకింగ్ చేస్తున్నారు. అయితే డ్రైవర్ల సంఘం కార్యాలయం వద్ద ఓ భారీ వృక్షం విరిగి విద్యుత్ స్తంభాలపై పడింది. విద్యుత్ తీగలపై పడటంతో మూడు విద్యుత్ స్తాంభాలు నేలకొరిగాయి. హైటెన్షన్ వైర్లు నేలపై పడ్డాయి.

ఇదే సమయంలో కలెక్టరేట్ చుట్టూ వాకింగ్ చేస్తున్న వారు ఇది గమనించి అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరగాన్నే విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదం కు కారణాన్ని పరిశీలించారు. చెట్టు విరిగిపడటం వల్లే విద్యుత్ స్తంభాలు నెలకొరిగినట్లు గుర్తించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ(AE) వెల్లడించారు.

Leave a Reply