జిల్లా ఎస్పీతో కర్నూలు ఎంపీ భేటీ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అక్టోబర్ నెల రెండవ తేదీన దేవరగట్టు(Devaragattu)లో జరిగే మాల మల్లేశ్వర స్వామి బన్నీ(Banni) ఉత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు(MP Bastipati Nagaraju) జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కోరారు.
మంగళవారం 23 సెప్టెంబర్ 2025న జిల్లా పోలీస్ కార్యాలయం(Police Office)లో ఎంపీ, ఎస్పీని కలిశారు. ఈ సందర్బంగా దేవరగట్టు బన్నీఉత్సవంపై చర్చించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భక్తులు బన్నీఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు..