కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పాణ్యం నియోజకవర్గంలో భాగంగా (శనివారం ) కర్నూలు నగరంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.15 నిమిషాలకు ఉండవల్లి రెషిడెన్సియల్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి 10.45 కు ఫ్లైట్లో బయలుదేరుతారు. ఆ తర్వాత కర్నూలు ఎయిర్ పోర్టుకు 11.25 గంటలకు చేరుకుంటారు. అనంతరం 11.25 నుంచి 11.35 నిమిషాల వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఇక 11.35 నుంచి కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన సి. క్యాంప్ రైతు బజార్ కు చేరుకుంటారు. 11.55 నుంచి 12.25 వరకు రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహిస్తారు. 12.25 కు రైతు బజార్ నుంచి రోడ్డు మార్గాన నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన పార్కుకు భూమిపూజ నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రజా వేధికకు చేరుకొని, అక్కడ కర్నూలు నగర ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఇక సాయంత్రం 5.05 నిమిషాలకు రోడ్డు మార్గాన కర్నూలు ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.
చంద్రబాబు పర్యటన పై కలెక్టర్ సమీక్ష ….

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ నెల 17 వ తేదీన ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రజా వేదిక, సి క్యాంప్ రైతు బజార్, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పార్క్ భూమి పూజ కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏపీ సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి పరిశీలించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజా వేదిక వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కి సంబంధించి ప్రజల నుండి అర్జీలు తీసుకునేందుకు గాను కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు బ్యానర్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా, డిఆర్డిఎ పిడి లను ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత … జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం కు ఎదురుగా ఉన్న మెగా సిరి ఫంక్షన్ హాల్ లో పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… కర్నూలు పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, సభ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.
చేయకూడనవి, చేయవలసిన వాటికి గురించి తెలిపారు.
అడిషనల్ ఎస్పీలు 4 గురు , 11 మంది డిఎస్పీలు, 53 మంది సిఐలు, 101 మంది ఎస్సైలు , 383 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు , 680 మంది కానిస్టేబుళ్ళు , 51 మంది మహిళా పోలీసులు, 416 మంది హోంగార్డులు, 5 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 6 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. కర్నూలు జిల్లా ఎస్పీ తో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ కర్నూలు రేంజ్ పరిధిలోని అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.
