Kurnool | విజయవంతం చేయండి..

Kurnool | విజయవంతం చేయండి..

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్ర సాహిత్య అకాడమీ, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అంశంపై సాహితీ సదస్సు డిసెంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4.00 గంటల వరకు రెండు వేదికలుగా నిర్వహించడం జరుగుతుందని అరసం జిల్లా అధ్యక్షులు కలం ప్రహ్లాద్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. నగర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చక్రవర్తి అధ్యక్షతన స్థానిక ఎస్ టి యు భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో వారు సదస్సు వివరాలు వెల్లడించారు.

ఈ సదస్సులో జాతీయ అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, విశిష్ట అతిథులుగా అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి , కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రధాన వక్తలుగా ఆచార్య ఎస్ వి సత్యనారాయణ, ఆచార్య కరిమిండ్ల లావణ్య ,కెపి అశోక్ కుమార్ ,డాక్టర్ ఎం హరి కిషన్, డాక్టర్ వింధ్యావాసినీ దేవి, కెంగార తాయప్పలు పాల్గొని అభ్యుదయ నాటకం, అభ్యుదయ నవల, అభ్యుదయ విమర్శ ,అభ్యుదయ కవిత, అభ్యుదయ కథలపై వారు ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం హరికిషన్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లా రామాంజనేయులు , సయ్యద్ జహీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సాహితీ అభిమానులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply