Kurnool | ప్రాక్టికల్ పరీక్షలను కట్టుదిట్టంగా జరపాలి…

Kurnool | ప్రాక్టికల్ పరీక్షలను కట్టుదిట్టంగా జరపాలి…
- విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి…
- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి…
Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలు కల్పించి, కట్టుదిట్టంగా జరపాలని జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియేట్ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రాక్టికల్ పరీక్షలకు కావలసిన ఉపకరణాలు, కెమికల్స్ అన్నీ ఉండాలని, పరీక్షల నిర్వహణ గదులు పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి ఇతర సామాన్లు పరీక్ష గదులలో ఉండరాదని, గాలి – వెలుతురు బాగా ప్రసరించేలాగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యంలు ఉండాలని, వారి ఏకాగ్రతకు భంగం కలగకుండా చర్యలు ఉండాలన్నారు. సెల్ ఫోన్లను అనుమతించరాదని, పరీక్షలను కట్టుదిట్టంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆర్ఐవో లాలెప్ప మాట్లాడుతూ… ప్రాక్టికల్ పరీక్షలను 3 విడతలుగా జనరల్ విద్యార్థులు 20 మందిని చొప్పున, ఒకేషనల్ విద్యార్థులను 40 మంది చొప్పున నిర్వహించడం జరుగుతుందని, పరీక్షలు జనవరి 27 నుండి మొదలైతాయని మొత్తం 21,150 మంది పరీక్షలకు హాజరవుతారని, జిల్లా మొత్తంగా 100 పరీక్షా కేంద్రాలు ఉంటాయన్నారు. సీసీటీవీల కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణలో, పోలీసుల సహకారం తో 144 సెక్షన్ విధించి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.
ఈ సమావేశానికి ఆర్ఐఓ లాలెప్ప, అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గోవింద నాయక్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ ఉమా, ట్రాన్స్‌కో డిఇ భాస్కర్, సమగ్ర శిక్ష అభియాన్ నుండి సుహాసిని, సోషల్ వెల్ఫేర్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఒకేషనల్ అధికారి సురేష్ బాబు, ఆర్టీసీ తరఫున డిపో మేనేజర్ సుధారాణి, త్రీటౌన్ సీఐ శేషయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన ప్రిన్సిపాల్ లు, లెక్చరర్ లు, డిస్ట్రిక్ట్ ఎక్సమినేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
