కుప్పం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది..
ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగ అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు.. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. ఇక, కుప్పం పర్యటన ముగించుకొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు…
ప్రభుత్వ విప్ , ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ మణికంఠ చందోలు ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ (ASL) విధానాలను అధికారులు సమీక్షించారు, ద్రవిడియన్ యూనివర్సిటీ మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.. ప్రసన్న గంగమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు మరియు భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ మరియు ఎస్పీ సమీక్షించారు.