Kuntala | కుస్తీ పోటీలు చూడడం కోసం..

Kuntala | కుస్తీ పోటీలు చూడడం కోసం..
Kuntala, ఆంధ్రప్రభ : ఓలా గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలను మామిడి చెట్ల పైకి ఎక్కి తిలకించారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మలయోధులు రావడంతో కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. సూర్యాపూర్ ఓలా గ్రామాల్లో మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని మొదటి రోజు సూర్యాపూర్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. మరుసటి రోజు ఓలా గ్రామంలో నిర్వహిస్తారు. అయితే.. ఈ పోటీల్లో రెండవ సెమీఫైనల్ ఆసక్తికరంగా దాదాపు అరగంటసేపు కొనసాగింది. చివరికి సాయినాథ్ అనే మలయోధుడు విజేతగా నిలిచాడు.
ఆయన్ని ఆరువేల నగదు శాలువాతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకులు నాలం శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు భోజన్న, ఎగ్గం నరసింహులు, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, శరత్ గౌడ్, సదాశివ్ పటేల్, నాళం మహేందర్, సాధు ప్రభాకర్, సుదర్శన్ పటేల్, తుమ్మల రాజ్ కుమార్, కంబోలి చిన్నన్న, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, మలయోధులు తదితరులు పాల్గొన్నారు.

