చిత్తూరు జిల్లాకు చేరుకున్న కుంకీ ఏనుగులు
బెంగళూరు నుంచి లారీల్లో తరలించిన అధికారులు
పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌కు రెండు
తిరుపతి జూపార్క్‌కు రెండు కుంకీ ఏనుగుల తరలింపు
తిరుపతి – బెంగళూరులోని విధానసౌధ వద్ద నిన్న జరిగిన కార్యక్రమంలో ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కు నాలుగు కుంకీ ఏనుగుల అప్పగించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ సందర్భంగా గజ పూజ అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకీ ఏనుగులను సాగనంపగా.. డిప్యూటీ సీఎం పవన్ పూలుజల్లి ఆ ఏనుగులను స్వాగతించారు. కుంకీ ఏనుగులు కృష్ణ (15 ఏళ్లు) అభిమన్యు(14), దేవా (39), రంజన్ (26)లను కర్ణాటక అధికారులు ప్రత్యేక లారీలలో ఎపికి పంపారు… ఆ నాలుగు ఏనుగులు నేడు పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌కు చేరుకున్నాయి.. వాటిలో రెండు ఏనుగులను తిరుపతి జూ పార్క్ కు తరలించారు.. త్వరలోనే మరో రెండు ఏనుగుల రానున్నాయి..
ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సోదరుల కష్టాలకు పరిష్కారం చూపేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపడంపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వపనన్నకు శుభాభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. ఏనుగుల విధ్వంసంతో నష్టపోతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించిన ఉప ముఖ్యమంత్రికి, అడగగానే కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్విట్ చేశారు..
ఇక యువగళం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఏనుగుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్నామని రైతు సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు.