Kims | మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్

హైద‌రాబాద్ : సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా ఉదయం నుంచి హరీష్ రావు హైదరాబాద్ లోనే ఉన్నారు. రాత్రి కేటీఆర్ విచారణ పూర్తి చేసుకొని తెలంగాణ భవన్ కు రాగా.. అక్కడ అతనితో మాట్లాడిన హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు.

ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతున్న హరీష్ రావు డీహైడ్రేషన్ (Dehydration) కారణంగా వైరల్ ఫివర్‌తో బాదపడుతుండడంతో డాక్టర్లు ఆయన్ను ఆస్పత్రిలోనే అడ్మీట్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ (KTR) బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి (Kim’s Sunshine Hospital)లో చేరిన హరీష్ రావును పరామర్శించారు.

అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం వైరల్ ఫీవర్‌ (Viral fever)తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జి చేస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు.

Leave a Reply