12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్

12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్

  • ఆహ్వానించిన బాల్క సుమన్

హైదరాబాద్, ఆంధ్రప్రభ ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లా పర్యటనకు రావాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేటీఆర్ ను శుక్రవారం కలిసి ఆహ్వానించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ 12వ తేదీన జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పాల్గొంటారన్నారు.

జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో ఒడిదొడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, సభ్యులను కేటీఆర్ సన్మానిస్తారన్నారు. మధ్యాహ్నం 12:30 మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు కేటీఆర్ హాజరు అవుతారని, వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు క్యాతన్‌ పల్లిలోని బాల్క నివాసంలో కేటీఆర్ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు..అదే సమయంలో పలు సంఘాల నాయకులను కేటీఆర్ ను కలుస్తారని తెలియజేశారు.

Leave a Reply