సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడని…. అతని వళ్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం ఉందన్నారు. రేవంత్ ను వెంటనే మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రేవంత్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ సూచించారు. చీప్ మినిస్టర్ రేవంత్ రడ్డి త్వరగా కోలుకోవాలంటూ కేటీఆర్ సెటైర్ వెశారు.