హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ నివేదిక తప్పుడు నివేదిక అని, ఇందుకు పార్టీ శ్రేణులు ఈ రోజు, రేపు ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు (కేటీఆర్) (KTR) అన్నారు.
కాంగ్రెస్ కుట్రలపై ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పార్టీ శ్రేణుల (Party workers) కు సూచించారు. అంతకుముందు పార్టీ అధినేత కేసీఆర్ (KCR) తో ఆయన భేటీ అయ్యారు. కాళేశ్వరంపై తప్పుడు నివేదిక రూపొందించారని బీఆర్ఎస్ (BRS) నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.