KTR | రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే

KTR | రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే

పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టం
భూపాలపల్లి ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్

KTR | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి లక్కీడ్రాలో సీఎం అయ్యారని… రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్ని దేవుళ్లకు ముక్కుతావో మొక్కుకో… రేవంత్ పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల హామీలను పక్కనపెట్టి కుంభకోణాలకు తెరలేపారని అన్నారు.

రెండేళ్ల ఆ పార్టీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు. సింగరేణిని సీఎం రేవంత్‌, ఆయన బావమరిది దోచుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలను ఆ పార్టీ నేతలు ముంచుతారన్నారు. రూ.4వేల పింఛను, తులం బంగారం వచ్చినవారు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఎద్దేవా చేశారు. రూ.2వేల పింఛను, రైతుబంధు పొందిన వారు బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తేనే హామీలు అమలవుతాయని చెప్పారు. బీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలపించాలని కోరారు.

Leave a Reply