Krishnaiah | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

Krishnaiah | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా
- గన్యాగుల గ్రామ సర్పంచ్ అభ్యర్థి కందూరు కృష్ణయ్య
Krishnaiah | నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గన్యాగుల గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని గన్యాగుల గ్రామ సర్పంచ్ అభ్యర్థి టీఆర్ఎస్ బలపరిచిన కందూరు కృష్ణయ్య అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న కందూరు కృష్ణయ్య గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అందరికీ చేదోడువాదోడుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు.
తాను గతంలో సర్పంచ్ గా పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయానని, ప్రస్తుతం సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తూ ప్రజలకు, రైతులకు సేవలందిస్తున్నానని చెప్పారు. తాను గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలు, ఐమాక్స్ లైట్లు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే కాకుండా సింగిల్ విండో ద్వారా రైతులకు నాలుగు కోట్ల రుణాలు దాదాపుగా ఇవ్వడం జరిగిందని సింగిల్ విండో గోదాం కూడా మంజూరు చేయించడం జరిగిందని కందూర్ కృష్ణయ్య తెలిపారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శక్తి మేరకు గ్రామ అభివృద్ధికి కృషి చేశామని రాబోయే కాలం కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపించాలని తన గెలుపు కోసం కృషి చేయాలని బంధుమిత్రులను శ్రేయోభిలాషులను ఓటర్లను కోరారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మద్దతు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన గ్రామ ఓటర్లను ప్రజలను కోరారు.
