Krishnaiah | అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా

Krishnaiah | అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా
- లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొంగళ్ళ కృష్ణయ్య
Krishnaiah | నవాబ్ పేట, ఆంధ్రప్రభ : అవకాశం ఇస్తే ఆత్మసాక్షిగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొంగల్లా కృష్ణయ్య ఓటర్లను కోరుతున్నారు. ఇవాళ అభ్యర్థి గడపగడపకు ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
తనకు ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్లు సక్రమ నిర్వహణకు చిత్త శుద్ధితో పని చేస్తానన్నారు. ముఖ్యంగా యూత్ ను క్రీడల్లో ప్రోత్సహించడం, అర్హులైన వారికి పెన్షన్ లు, ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తా అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, మరింతగా సేవలందిస్తానని, సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వివరించారు.
ప్రజలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి గ్రామ అభివృద్ధి అంటే ఏమిటో చేతల్లో చూపిస్తానని, తనకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు ఆదరించాలని వారు కోరారు. ఆయన ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతుండటం వలన ఇతర అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
