కృష్ణ శతకం

25. కృష్ణజన్మమందు కీర్తి సంపాదించె
గాడిదైననేమి ఘనముగాను
తాను కూయగానె ధరణికంపించెను
గీతదాత నీకు కేలుమోడ్తు

26. వసుధయందు గొప్ప వసుదేవుడైనను
దాని కాలుపట్టె దీనుడగుచు
అవసరమ్మునున్న ఎవరైన ఇంతెగా
గీతదాత నీకు కేలుమోడ్తు

27. రాలుగాయి వంచు రాలు విసరువారు
బోలెడంతమంది పధ్వి మీద
తత్త్వమెక్కపట్టి తలకు మాసినవారు
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply