కృష్ణ శతకం

13. దేవకి వసుదేవ దివ్య సంతానమై
పుడమిలోన నీవు పుట్టినావు
జగమనంగనేమి? జైలు రూపమే కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు

14. బంధనమున పుట్టి బంధనముల త్రెంచు
మహిమగలుగు దేవ మార్గమీవె
ఎవరుసాటీగలరు ఈ విశ్వమందున
గీతదాత నీకు కేలుమోడ్తు

15. ఘనుడవయ్య నీవు కాళియమర్దన
పాలసంద్రమందు పవ్వళించి
పాలు తేనెకలుప భాగవతమ్మగు
గీతదాత నీకు కేలుమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *