103. బలముకలుగువాడు బలరాముడేయన్న
సత్యభామ ఎప్పుడు శక్తినిచ్చు
భక్తసంద్రమందు పవ్వళించెడువాడు
గీతదాత నీకు కేలుమోడ్తు
104. యోగబలము చేత యోగీశ్వరేశ్వరా!
భోగివైనగాని త్యాగివయ్య
అనుభవమ్ము వలన అమరసుఖముగల్గె
గీతదాత నీకు కేలుమోడ్తు
105. అవనియందు మనిషి అస్థిరత్వమునున్న
నీదు ప్రేరణమునె నెగ్గుకొచ్చు
అదియె లేనివాడు అంత చీకటి సుమ్ము
గీతదాత నీకు కేలుమోడ్తు