100. ఎవడు శాశ్వతంబు భువిమీద శోధింప
యాత్ర సాగుతుండు యవనికపయి
పాత్రధారులమయ సూత్రధారివి నీవె
గీతరాత నీకు కేలుమోడ్తు
101. నిలువగలదు ప్రాణి నీ బాసటున్ననే
నీవు చేయి విడువ భువిని విడుచు
ఇంత దానికైన ఎంత గర్వమొకదా!
గీతరాత నీకు కేలుమోడ్త్తు
102. ముందుగతిని తెలియ మోహమ్ము వదలును
మోసమేమి లేక ముక్తి కోరు
జన్మసార్థకమ్ము చరితార్థమైపోవు
గీతదాత నీకు కేలుమోడ్తు