7. విష్ణుమాయ యనిన వేరు మాయయనిన
లీలలన్ని ఇంద్రజాలమేను
మంత్రమేదియయిన తంత్రమ్మునీదెగా!
గీతదాత నీకు కేలుమోడ్తు
8. రుక్మిణమ్మ తలపు రుద్రునియాజ్ఞవౌ
సత్యభామ మాట శాసనమ్ము
గోపకాంతల నుడి తీపి గుర్తులు కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు
9. కృష్ణలీలలంచు కేరింతలను వేయు
కుర్రకారు జూచి బుర్రతిరుగు
రాసలీలకాదు… రాచలీలయె నీది
గీతదాత నీకు కేలుమోడ్తు