కృష్ణ శతకం

85. మీనమేషమేల మీరాకు సరిజోడు
కాంచలేము భక్తగణమునందు
భక్తులకును సాటి భక్తులేయనవచ్చు
గీతదాత నీకు కేలుమోడ్తు

86. అసురహంతకుండ ఆ జన్మఅంతము
వెసులుబాటు లేని వేల్పు నీవు
లోకరక్షణమ్ము ఏక కర్తవ్యమ్ము
గీతదాత నీకు కేలుమోడ్తు

87. మురళిగానలోల ముచ్చట నిమ్రోల
భయము లేదు మాకు జయముతప్ప
నిండు సంతసమ్ము నిండు నూరేండ్లుండు
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *